kcr: కాంగ్రెస్ గురించి నేను చెప్పడానికి ఏమీ లేదు.. మీరే చెప్పాలి: కేసీఆర్

  • ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్తున్నాం
  • వచ్చే ఏడాదికి ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి
  • కళ్యాణలక్ష్మిలాంటి పథకం దేశంలో ఏ రాష్ట్రంలో లేదు

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్తున్నామని... సంపదను పెంచుకుంటూ పోతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కళ్యాణలక్ష్మి పథకంలాంటిది దేశంలో ఏ రాష్ట్రంలో లేదని చెప్పారు. అత్యధిక వేతనాలు పొందుతున్న హోంగార్డులు, ఆశా వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు మన రాష్ట్రంలోనే ఉన్నారని తెలిపారు. మనం ఎవరి నుంచి వేరుపడ్డామో... ఇప్పుడు మనల్ని చూసి, వారే ఆశ్చర్యపోతున్నారని చెప్పారు.

కుంభకోణాలు, అవినీతి, గూండాయిజం, అరాచకాల్లాంటి వాటిని పారద్రోలామని తెలిపారు. రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. వచ్చే ఏడాదికి అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పడానికి ఏమీ లేదని, అది మీరే చెప్పాలని ఎద్దేవా చేశారు.  ఈరోజు మరో నాలుగు సభలకు వెళ్లాల్సి ఉందని... అందుకే మాట్లాడాలని ఉన్నా, ఇంతటితో ముగిస్తున్నానని చెప్పారు. సిద్ధిపేట బహిరంగసభలో ప్రసంగిస్తూ, కేసీఆర్ పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News