parakala: కొండా దంపతుల బెదిరింపులకు భయపడకండి...మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా: చల్లా ధర్మారెడ్డి

  • పరకాల మండలంలో ఎన్నికల ప్రచారం
  • కొండా దంపతుల హెచ్చరికలను పట్టించుకోవద్దని సూచన
  • టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గమనించాలని వేడుకోలు
ఎవరి బెదిరింపులకు ఓటర్లు భయపడాల్సిన పనిలేదని, తన మద్దతుదారులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వరంగల్‌ జిల్లా పరకాల నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు. పరకాల మండలం వెంకటాపూర్‌, హైబోత్పల్లి, లక్ష్మిపురం, రాయపర్తి తదితర గ్రామాల్లో ధర్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కొండా దంపతుల బెదిరింపుల అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ విధంగా భరోసా ఇచ్చారు. 'నన్ను నమ్ముకున్న వారి వెన్నంటి ఉంటాను. మీరు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు’ అని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ఓటర్లు గమనించాలని, అభివృద్ధికి కట్టుబడిన పార్టీలకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
parakala
konda family
challa dharmareddy

More Telugu News