sensex: వెనక్కి మళ్లిన విదేశీ నిధులు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు
- వరుసగా రెండో రోజు నష్టాల్లో మార్కెట్లు
- 274 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలు మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో పాటు, విదేశీ నిధులు వెనక్కిమళ్లడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 274 పాయింట్లు నష్టపోయి 35,199కి పడిపోయింది. నిఫ్టీ 56 పాయింట్లు కోల్పోయి 10,600కు దిగజారింది.
టాప్ గెయినర్స్:
జైప్రకాశ్ అసోసియేట్స్ (6.89%), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ (5.90%), ఇండియన్ ఎనర్జీ ఎక్స్ ఛేంజ్ (5.68%), స్పైస్ జెట్ (5.63%), దాల్మియా భారత్ లిమిటెడ్ (5.63%).
టాప్ లూజర్స్:
డీసీఎం శ్రీరాం (-4.31%), హిందుస్థాన్ కన్స్ స్ట్రక్షన్ కంపెనీ (-4.16%), ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ (-3.99%), వెల్స్ పన్ కార్పొరేషన్ (-3.90%), రెడింగ్టన్ ఇండియా (-3.67%).