sensex: లాభాల స్వీకరణ.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- లాభాల నుంచి నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు
- 218 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 10,526 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. ఈ రోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కాగానే మార్కెట్లు లాభాల్లోకి వెళ్లాయి. అయితే, ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 218 పాయింట్లు పతనమై 34,981కి పడిపోయింది. నిఫ్టీ 73 పాయింట్లు కోల్పోయి 10,526కు దిగజారింది.
టాప్ గెయినర్స్:
దీపక్ ఫర్టిలైజర్స్ (9.56%), షాపర్స్ స్టాప్ (7.76%), ఐడీఎఫ్సీ బ్యాంక్ (7.71%), క్యాపిటల్ ఫస్ట్ (7.56%), చంబల్ ఫర్టిలైజర్స్ (5.15%).
టాప్ లూజర్స్:
వొడాఫోన్ ఐడియా (-7.43%), పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ (-5.08%), కాక్స్ అండ్ కింగ్స్ (-4.56%), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (-4.42%), జైన్ ఇరిగేషన్ (-4.20%).