KCR: నేను చేతికి కట్టుకుంటే చేతికి, మెడకు కట్టుకుంటే మెడకు... ఆంధ్రోళ్లకు ఏం తెలుసు: కేసీఆర్

  • నిత్యమూ కేసీఆర్ చేతికి కనిపించే దట్టీ
  • దట్టీ వెనకున్న చరిత్రను చెప్పిన కేసీఆర్
  • అదే సమయంలో ఆంధ్రులపై సెటైర్లు

ఎల్లప్పుడూ తన చేతికి కట్టుకుని ఉండే 'దట్టీ' గురించి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న పలు ప్రచార సభల్లో పాల్గొన్న ఆయన, ముస్లిం సంప్రదాయంలో ఇమాన్ ఏ జామీన్ (క్షేమంగా వెళ్లి, లాభంగా రా) అంటూ చేతికి దట్టీ కడతారని చెబుతూ, ఆంధ్రోళ్లకు దీనిని ఎందుకు కట్టుకుంటారో, దీని వెనకున్న కథేంటో తెలియదని దెప్పిపొడిచారు. తాను కట్టుకోవడం చూసి, చాలామంది కట్టుకుంటున్నారని, రేపెన్నడైనా తాను మెడకు దాన్ని కట్టుకుంటే, ఆంధ్రోళ్లు కూడా మెడకు కట్టుకుంటారని అన్నారు. ఆపై దట్టీ వెనకున్న ప్రాచీన గాధను వినిపిస్తూ, మహ్మద్ ప్రవక్త మనుమడు ఇమాన్ హుస్సేన్ ఈ దట్టీని తొలిసారిగా వాడారని చెప్పారు.

"మక్కాలో ఓ కసాయి వ్యక్తి, జింకను పట్టుకుని చంపేందుకు ప్రయత్నిస్తుండగా, అది ఏడుస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్లిన ఇమాన్ హుస్సేన్, ఆ  జింక ఎందుకు ఏడుస్తుందో తెలుసా? అని ప్రశ్నించాడు. ఆ జింక బిడ్డ పాల కోసం ఏడుస్తోందని, నువ్వు విడిచిపెడితే, అది వెళ్లి పాలిచ్చి వస్తుందని చెబుతాడు. దీన్ని నమ్మని కసాయివాడు జింకను వదిలేందుకు నిరాకరించగా, ఆ జింకను వదిలేయాలని, అది రాకపోతే తనను కోసేయాలని చెబుతాడు. దీంతో ఆశ్చర్యపోయిన కసాయి, జింకను వదిలిపెట్టగా, 'క్షేమంగా వెళ్లి... లాభంగా రా' అంటూ తన రుమాలును ఆ జింకకు కట్టాడు హుస్సేన్. ఆ జింక వెళ్లి, బిడ్డకు పాలిచ్చి తిరిగొచ్చింది. ఆపై కసాయి మనసు మారి, హుస్సేన్ కు నమస్కరించి, జింకను వదిలేశాడు" అంటూ ఇది చాలా పవిత్రమైనదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News