Actress: 'అన్నయ్యా...' అన్నా వదలకుండా ఎత్తుకుని తీసుకెళ్లాడా నీచుడు: సినీ నటి కృష్ణవేణి

  • తనకో వేషం ఇచ్చి వేధింపులు
  • పేకప్ తరువాత లాక్కెళ్లిన నీచుడు
  • కేకలు విని పరిగెత్తుకు వచ్చిన మేనేజర్
  • నాటి ఘటనను గుర్తు చేసుకున్న కృష్ణవేణి
చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన లైంగిక వేధింపులపై సీనియర్ నటి కృష్ణవేణి స్పందించారు. 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, తనకో వేషం ఇచ్చి, ఆపై లైంగిక అవసరాలు తీర్చుకోవాలని చూసిన నీచుడిని గుర్తు చేసుకున్నారు. అతని పేరు చెప్పకుండానే, ఓ నీచుడు తనకు సినిమాలో వేషం ఇచ్చాడని, షూటింగ్ తరువాత, తాను హైదరాబాద్ కు రైలెక్కి వెళ్లేందుకు సిద్ధమవుతున్న వేళ ఆ ఘటన జరిగిందని చెప్పారు.

పేకప్ తరువాత, తాను నిలబడి ఉంటే, వెనుకవైపు నుంచి వచ్చి, రెండు చేతులతో ఎత్తి రూమ్ లోకి తీసుకెళ్లిపోయాడని అన్నారు. తాను గింజుకుంటూ "అన్నయ్యా... అన్నయ్యా వదులు" అని వేడుకున్నా వదల్లేదని, తన కేకలు విని మేనేజర్ పరిగెత్తుకుంటూ వస్తుంటే అప్పుడు వదిలాడని చెప్పారు. ఆ నీచుడిని కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టే కొట్టానని అన్నారు.
Actress
Krishnaveni
Harrasment

More Telugu News