MLC: ఎమ్మెల్సీ యాదవరెడ్డిని సస్పెండ్ చేసిన కేసీఆర్!
- పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు
- పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలు
- కాంగ్రెస్ లో చేరే అవకాశం!
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలపై ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డిని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. యాదవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారని గత కొంత కాలంగా ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే యాదవరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం ప్రకటించింది. కాగా, తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? లేక మరేదైనా పార్టీని ఆశ్రయిస్తారా? అన్న విషయమై యాదవరెడ్డి ఇంకా స్పందించలేదు.