Congress: కాంగ్రెస్ మేనిఫెస్టో లీక్... ముఖ్యాంశాలివే!

  • రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ
  • అద్దె ఇంట్లో ఉండే పేదలకు రూ. 50 వేలు
  • ఏడాదిలో లక్ష ఉద్యోగాల భర్తీ
  • ప్రజాకర్షకంగా కాంగ్రెస్ మేనిఫెస్టో!

నేడు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననుండగా, ఇదే సభలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను ప్రకటించనుంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఈ మేనిఫెస్టోను ప్రజాకర్షకంగా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు ఏంటంటే...

రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. అద్దె ఇంట్లో ఉంటున్న పేదలకు సంవత్సరానికి రూ. 50 వేలు ఇస్తామని తెలపనుంది. అధికారంలోకి వస్తే, ఏడాదిలో లక్ష ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు రూ. 3 వేల నెలసరి భృతి, బీసీలకు సబ్ ప్లాన్ అమలు మేనిఫెస్టోలో ఉన్నట్టు సమాచారం.

 స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, రెండు విడతల్లో ఫీజు రీయింబర్స్ మెంట్, అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం, వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు అన్న అంశాలను చేర్చినట్టు తెలుస్తోంది. వీటితో పాటు తెలంగాణలో తొలగించబడిన 26 కులాలను తిరిగి బీసీల్లో కలపడం, జర్నలిస్టులకు రూ. 200 కోట్లతో సంక్షేమ నిధి, 20 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేలా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తదితర హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి.

  • Loading...

More Telugu News