Ink: ఓటు వేసే వేళ చూపుడు వేలికి ఇంక్... ఆ వేలు లేకుంటే ఏం చేస్తారో తెలుసా?

  • మధ్యవేలిపై సిరా
  • అది కూడా లేకుంటే ఉంగరపు వేలు
  • అసలు చేతులే లేకుంటే ఎడమ చెంపపై సిరా
  • స్పష్టంగా ఉన్న ఈసీ నియమావళి

ఎన్నికల్లో ఓటు వేసిన తరువాత, గుర్తుగా ఎడమచేతి చూపుడు వేలుకు సిరా గుర్తును అధికారులు పెడతారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఇంక్ అంత త్వరగా చెరిగిపోదు. మరోమారు ఓటు వేయకుండా చూసేందుకే ఇలా చేస్తారు. ఇక, ఒకవేళ ఎవరికైనా చూపుడు వేలు లేకుంటే ఏం చేస్తారో తెలుసా? అటువంటి పరిస్థితి వస్తే ఏం చేయాలన్న విషయమై ఈసీ కొన్ని నియమాలతో ఓ మార్గాన్ని నిర్దేశించింది.

ఎవరికైనా చూపుడు వేలు లేకుంటే మధ్యవేలికి ఇంక్ మార్క్ వేయవచ్చు. మధ్యవేలు కూడా లేకుంటే ఉంగరపు వేలు, అది కూడా లేకపోతే చిటికెన వేలు... ఇలా బొటన వేలి వరకూ రావచ్చు. ఒక వేళ ఎడమ చెయ్యి మొత్తం లేకుంటే, కుడి చేతికి ఇదే నిబంధనలతో కూడిన క్రమాన్ని పాటించాల్సి వుంటుంది. రెండు చేతులకూ వేళ్లు లేకుంటే మధ్యభాగంపై, అసలు చేతులే లేకుంటే భుజాలపై, అవి కూడా లేకుంటే ఎడమ చెంపపై సిరా వేయాలని ఈసీ నిబంధనలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News