Redmi: నిమిషాల్లోనే 6 లక్షల ఫోన్లు అమ్ముడుపోయాయి... ప్రస్తుతం మరోసారి ఫ్లాష్ సేల్
- ‘రెడ్‌మీ నోట్ 6’ ప్రో విడుదల
- బ్లాక్ ఫ్రైడే సేల్ కింద రూ.12999కే ఫోన్
- నేటి సాయంత్రం మరోసారి ఫ్లాష్ సేల్
నిమిషాల్లోనే 6 లక్షల ఫోన్లు అమ్ముడుపోవడం విస్మయపరుస్తోంది. భారత స్మార్ట్‌ఫోన్ విపణిలో షియోమీ రెడ్‌మీ ఫోన్లకు ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో దీన్ని బట్టే అర్థమవుతోంది. తాజాగా ఈ కంపెనీ నుంచి ‘రెడ్‌మీ నోట్ 6’ ప్రో విడుదలైంది. దీని ప్రారంభ ధర రూ.13999 ఉండగా.. బ్లాక్ ఫ్రైడే సేల్ కింద రూ.12999కే అందించారు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై కొనుగోలు చేసిన వినియోగదారులకు మరో రూ.500 రాయితీ అదనంగా లభించింది.
దీంతో నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్ సేల్ నిర్వహించగా నిమిషాల్లోనే 6 లక్షల ఫోన్లు అమ్ముడైపోయాయి. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం 3గంటలకు మరోసారి ఫ్లాష్ సేల్ నిర్వహించగా నిమిషాల్లోనే స్టాక్ మొత్తం అయిపోయిందట. ఈ విషయాలను షియోమీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నేటి సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య మరోసారి ఫ్లాష్ సేల్ నిర్వహించనున్నారు.
‘రెడ్‌మీ నోట్ 6’ ఫీచర్లు..
ఈ ఫోన్‌ను నాలుగు కెమెరాలతో ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
బ్యాక్ సైడ్ 12 ఎంపీ, 5 ఎంపీతో రెండు కెమెరాలు
ఫ్రంట్ 20 ఎంపీ, 2 ఎంపీతో రెండు కెమెరాలు
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్
ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్
6.26 అంగుళాల డిస్‌ప్లే
4000ఎంఏహెచ్ బ్యాటరీ
4జీబీ, 6జీబీ వేరియంట్స్