TRS: మెల్‌బోర్న్ టీ20 మ్యాచ్ లో టీఆర్ఎస్ ప్లకార్డుల ప్రదర్శన!

  • మెల్‌బోర్న్‌లో భారత్-ఆసీస్ రెండో టీ20
  • ఓట్ ఫర్ కార్ అంటూ ప్లకార్డుల ప్రదర్శన
  • కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టీ20ని టీఆర్ఎస్ అభిమానులు ప్రచార వేదికగా మార్చుకున్నారు. మ్యాచ్ జరుగుతుండగా టీఆర్ఎస్‌ను గెలిపించాలంటూ కొందరు తెలంగాణ యువకులు ప్లకార్డులు ప్రదర్శించారు. కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ‘ఓట్ ఫర్ కార్’ అని రాసున్న ప్లకార్డులను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపించాలని ఈ సందర్బంగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ నేత కాసర్ల నాగేందర్ రెడ్డి కోరారు.

కాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టీ20 వర్షం కారణంగా రద్దు అయింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్ వద్ద వర్షం పడడంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ తర్వాత మ్యాచ్‌ను రెండుసార్లు కుదించినప్పటికీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేశారు. తొలి టీ20లో గెలిచిన ఆస్ట్రేలియా 1-0తో భారత్‌పై ఆధిక్యం సాధించింది.
TRS
Australia
T20
melbourne
Team India
Telangana
KCR

More Telugu News