AP assembly: డిసెంబరు 10 తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసన సభ శీతాకాల సమావేశాలు
- రెండు రోజుల పాటు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయం
- చంద్రబాబు ఢిల్లీ పర్యటన నుంచి వచ్చాక దీనిపై తుది నిర్ణయం
- ఈ సమావేశాల్లోనే శాసన మండలి చైర్మన్ ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిసెంబరు పదో తేదీ తర్వాత సమావేశమయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను రెండు రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తుది ప్రకటన వెలువడాల్సి ఉంది.
బీజేపీయేతర పక్షాల సమావేశం డిసెంబరు 10వ తేదీన ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు చంద్రబాబునాయుడు హాజరవుతున్నారు. ఈ సమావేశం పూర్తయి బాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక సమావేశాల తేదీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శాసన మండలి చైర్మన్‌గా పనిచేసిన ఎన్.ఎం.డి.ఫరూక్‌ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోవడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అందువల్ల ఈ ఎన్నికల్లోనే మండలి చైర్మన్ ఎన్నిక కూడా జరగాల్సి ఉంది.