kidari sravan: మంత్రి కిడారి శ్రావణ్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంతో పాటు ఆక్టోపస్‌ కమాండోల భద్రత

  • మావోయిస్టుల నుంచి ప్రమాదం దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం
  • సొంత జిల్లా విశాఖ ఏజెన్సీలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
  • భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారి నియామకం

ఇటీవల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిడారి శ్రావణ్‌కు రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచింది. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంతో పాటు ఆక్టోపస్‌ కమాండోలతో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సొంత జిల్లా విశాఖలో మంత్రి పర్యటించేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును కొద్దినెలల క్రితం మావోయిస్టులు ఏజెన్సీలో కాల్చిచంపిన విషయం తెలిసిందే.

ఈ ఘటనతో ఆయన తనయుడు కిడారి శ్రావణ్‌కు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు ఆయనకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపధ్యంలో ఏజెన్సీలో మావోయిస్టుల నుంచి శ్రావణ్‌కు ప్రమాదం ఉందన్న ముందస్తు ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంది.

తాజా నిర్ణయంతో ఇకపై శ్రావణ్‌కుమార్‌ వెంట ఎప్పుడూ నలుగురు గన్‌మెన్‌లు ఉంటారు. నల్ల దుస్తులు ధరించిన ఆక్టోపస్‌ కమాండోలు వలయంగా నిల్చుంటారు. శ్రావణ్‌ భద్రత వ్యవహారాలను పర్యవేక్షించేందుకు నియమించిన ప్రత్యేక అధికారి నిత్యం కిడారి వెంట ఉంటారు.

  • Loading...

More Telugu News