sensex: లాభాలతో కళకళలాడిన దేశీయ స్టాక్ మార్కెట్లు!
- ప్రభావం చూపిన రూపాయి విలువ
- 373 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 101 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కళకళలాడాయి. అంతర్జాతీయ సానుకూలతలతో పాటు రూపాయి విలువ కూడా బలపడటంతో... ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో, వారు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 373 పాయింట్లు లాభపడి 35,354కు పెరిగింది. నిఫ్టీ 101 పాయింట్లు పుంజుకుని 10,629కి ఎగబాకింది.
టాప్ గెయినర్స్:
అదానీ పవర్ (6.21%), వీఐపీ ఇండస్ట్రీస్ (6.13%), ఇన్ఫో ఎడ్జ్ ఇండియా (5.37%), హీరో మోటోకార్ప్ (5.02%), క్వాలిటీ (4.97%).
టాప్ లూజర్స్:
శంకర బిల్డింగ్ ప్రాడక్ట్స్ (-5.16%), జిందాల్ స్టీల్ అండ్ పవర్ (-5.16%), దీపక్ ఫర్టిలైజర్స్ (-4.89%), బలరాంపూర్ చీనీ మిల్స్ (-4.78%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (-4.76%).