Badminton: కరెంట్ షాక్ కొట్టడంతో మృతిచెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ త్రినాంకుర్!

  • ప్రస్తుతం  స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో పనిచేస్తున్న త్రినాంకుర్
  • హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి తీవ్రగాయాలు
  • సంతాపం తెలిపిన పశ్చిమ బెంగాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర డబుల్స్ నంబర్ వన్ ర్యాంకర్ త్రినాంకుర్ నాగ్ (26) విద్యుత్ షాక్ తో దుర్మరణం పాలయ్యాడు. ప్రస్తుతం స్పోర్ట్స్ కోటాలో రైల్వే శాఖలో ఉద్యోగిగా ఉన్న త్రినాంకుర్, షెడ్లో పని చేస్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. త్రినాంకుర్ విధులు నిర్వహిస్తుండగా, హై టెన్షన్ కరెంట్ తీగలు తగిలాయి. దీంతో ఆయనకు తీవ్ర గాయాలుకాగా, అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు.

చిన్నతనం నుంచి బ్యాడ్మింటన్ పై ఆసక్తి పెంచుకున్న త్రినాంకుర్, పలు టోర్నీల్లో విజేతగా నిలిచాడు. అతని మృతికి  పశ్చిమ బెంగాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధికారి బిశ్వాస్‌ సంతాపాన్ని వెలిబుచ్చారు. తన ప్రతిభతో రాష్ట్రానికి పలు పతకాలు తెచ్చి పెట్టిన త్రినాంకుర్ ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకున్నానని ఆయన అన్నారు. త్రినాంకుర్ మృతితో ఓ గొప్ప క్రీడాకారుడిని కోల్పోయామని అన్నారు.

  • Loading...

More Telugu News