PK Sasi: కేరళ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఆరు నెలలు సస్పెండ్ చేసిన సీపీఎం

  • కేరళ ఎమ్మెల్యే శశిపై ఫిర్యాదు చేసిన మహిళ నాయకురాలు
  • అంతర్గత కమిటీ వేసిన పార్టీ అధిష్ఠానం
  • పార్టీ నుంచి ఆరు నెలలు బహిష్కరణ

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ సీపీఎం ఎమ్మెల్యే  పీకే శశిని పార్టీ నుంచి ఆరు నెలలు బహిష్కరిస్తూ సీపీఎం ఆదేశాలు జారీ చేసింది. శశి తనను లైంగికంగా వేధించడమే కాకుండా, అసభ్యంగా మాట్లాడుతున్నాడంటూ  మహిళా యూత్ నాయకురాలు ఒకరు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.

 స్పందించిన పార్టీ ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు మంత్రి ఏకే బాలన్, ఎంపీ పీకే శ్రీమతితో ఓ కమిటీని నియమించింది. దర్యాప్తు జరిపిన కమిటీ మహిళా నాయకురాలిపై లైంగిక వేధింపుల ఆరోపణలు నిజం కాదని తేల్చింది. అయితే, ఆమెతో అసభ్యంగా మాట్లాడడం నిజమేనని పేర్కొంది. ఈ మేరకు అధిష్ఠానానికి నివేదిక ఇచ్చింది.

దీనిని పరిశీలించిన అధిష్ఠానం ఎమ్మెల్యే శశిని ఆరు నెలల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బహిష్కరణ వేటుపై శశి స్పందించారు. పార్టీ తన జీవితంలో ఒక భాగమని, పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తానని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News