dhanush: ఫస్టు సింగిల్ తో దుమ్మురేపేస్తోన్న ధనుశ్
- ధనుశ్ హీరోగా 'మారి 2'
- సంగీత దర్శకుడిగా యువన్ శంకర్ రాజా
- డిసెంబర్ 21వ తేదీన విడుదల
బాలాజీ మోహన్ దర్శకత్వంలో ధనుశ్ కొంతకాలం క్రితం చేసిన 'మారి' ఆయన అభిమానులను ఆకట్టుకుంది. దాంతో బాలీజీ మోహన్ .. ధనుశ్ కలిసి సీక్వెల్ కి ప్లాన్ చేశారు. 'మారి 2' టైటిల్ తో ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా చాలా వేగంగా షూటింగు జరుపుకుంది. ధనుశ్ సొంత బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో ఆయన సరసన కథానాయికగా సాయిపల్లవి నటించింది.
వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేశారు. 'రౌడీ బేబీ ..' అంటూ ఈ సాంగ్ తమాషాగా సాగుతోంది. ధనుశ్ .. సాయిపల్లవిపై చిత్రీకరించిన ఈ పాటకి ప్రభుదేవా కొరియోగ్రఫీని అందించాడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటను లేడీ సింగర్ తో కలిసి ధనుశ్ ఆలపించాడు. ఈ పాటను ఆయనే రాయడం మరో విశేషం. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.