sensex: ఐటీ అండ.. వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 204 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 43 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 65 శాతం నష్టపోయిన అర్వింద్ లిమిటెడ్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఐటీ సూచీల అండతో పాటు రూపాయి విలువ బలపడటంతో లాభాలను మూటగట్టుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 204 పాయింట్లు లాభపడి 35,717కి పెరిగింది. నిఫ్టీ 43 పాయింట్లు పుంజుకుని 10,729కి చేరింది.
టాప్ గెయినర్స్:
ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ (8.57%), అదానీ పవర్ (7.63%), పెర్సిస్టెంట్ సిస్టమ్స్ (6.40%), ప్రిస్టేట్ ఎస్టేట్స్ (6.37%), మైండ్ ట్రీ లిమిటెడ్ (5.95%).
టాప్ లూజర్స్:
అర్వింద్ లిమిటెడ్ (-65.00%), యస్ బ్యాంక్ (-11.71%), ఇన్ఫీబీమ్ అవెన్యూస్ (-10.28%), శంకర బిల్డింగ్ ప్రాడక్ట్స్ (-9.38%), పవర్ ఫైనాన్స్ (-9.28%).