Pakistan: సిద్ధూకి బాసటగా పాక్ ప్రధాని.. పాక్‌లో పోటీ చేస్తే గెలుపు అతడిదేనన్న ఇమ్రాన్ ఖాన్

  • కర్తార్‌పూర్ కారిడార్‌కు ఇమ్రాన్ శంకుస్థాపన
  • గొడవలకు కారణం కశ్మీరే
  • దానిని పరిష్కరించుకుంటే అద్భుతాలు

కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు‌కు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బాసటగా నిలిచారు. కర్తార్‌పూర్ కారిడార్‌కు బుధవారం జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఇమ్రాన్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సిద్ధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన ప్రమాణ స్వీకారానికి వచ్చిన సిద్ధును భారత్‌లో ఎందుకు విమర్శిస్తున్నారో తనకు ఇప్పటికీ అర్థం కాలేదన్నారు.

ఇరు దేశాల మధ్య శాంతి సామరస్యాల కోసమే అతడు మాట్లాడాడని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య గొడవలకు కారణమైన కశ్మీర్ సమస్యను పరిష్కరించుకుంటే రెండు దేశాల మధ్య బలమైన బంధం ఏర్పడుతుందని ఇమ్రాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. జర్మన్, ఫ్రాన్స్ దేశాల్లా మనం ఉండలేమా? అని ప్రశ్నించారు. తన ప్రమాణ స్వీకారానికి వచ్చిన సిద్ధుకు పాకిస్థాన్‌లో బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉందని, ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసినా ఘన విజయం సాధిస్తారని నవ్వుతూ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News