isro: ఒకేసారి అంతరిక్షంలోకి 31 ఉపగ్రహాలు.. నేడు కీలక ప్రయోగం చేబడుతున్న ఇస్రో!

  • భారత్ కు చెందిన హైసిన్ ఉపగ్రహ ప్రయోగం
  • విదేశాలకు చెందిన 30 శాటిలైట్లు కక్ష్యలోకి
  • నిరంతరాయంగా కొనసాగుతున్న కౌంట్ డౌన్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చారిత్రక ప్రయోగానికి సిద్ధమైంది. ఈరోజు ఉదయం 9.58 గంటలకు ఏకకాలంలో 31 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ-43 వాహకనౌక ద్వారా పంపేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందులో భాగంగా ఇస్రో ప్రారంభించిన 28 గంటల కౌంట్ డౌన్ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ ప్రయోగంలో భాగంగా 30 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి ప్రయోగించనుంది.

భారత్ కు చెందిన హైసిస్ ఉపగ్రహాన్ని ఇస్రో కక్ష్యలోకి చేర్చనుంది. అలాగే అమెరికాకు చెందిన 23 చిన్న ఉపగ్రహాలతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, ఫిన్ ల్యాండ్, కొలంబియా, మలేసియా, నెదర్లాండ్స్, స్పెయిన్ దేశాలకు చెందిన ఉపగ్రహాలను ప్రయోగించనుంది. ఇందుకోసం ఇస్రో అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. గతంలో ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి ఇస్రో ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News