konasema: కోనసీమ అగ్నిగుండంగా మారింది.. వీడియో విడుదల చేసిన జనసేన!

  • ఆయిల్ కంపెనీలు సంపదను దోచుకుంటున్నాయి
  • నేతలకు లంచాలు ఇస్తూ అన్యాయం చేస్తున్నా
  • కోనసీమను బీడు భూమిగా మార్చేశారు

పచ్చటి కోనసీమను అభివృద్ధి పేరుతో ఆయిల్ కంపెనీలు దోచుకుంటున్నాయని జనసేన పార్టీ ఆరోపించింది. ప్రకృతి అందాలకు కేరాఫ్ గా మారిన కోనసీమను కాలుష్య కాసారంగా, బీడు భూమిగా మార్చేశారని విమర్శించింది. ఇక్కడ చోటుచేసుకున్న అవినీతికి గ్యాస్ ప్రమాదాలే ప్రత్యక్ష సాక్ష్యమని వ్యాఖ్యానించింది.

అధికారుల అవినీతి, ఆయిల్ కంపెనీల నిర్లక్ష్యానికి వందలాది మంది కోనసీమ ప్రజలు ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయారని విమర్శించింది. ఇప్పటివరకూ బాధితులకు న్యాయం జరగలేదనీ, నేతలకు లంచాలు ఇస్తూ విచారణను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియోను జనసేన పార్టీకి చెందిన శతాఘ్ని మిస్సైల్ ఈరోజు విడుదల చేసింది


  • Loading...

More Telugu News