Kadapa District: కడప స్టీల్ ప్లాంటుకు డిసెంబర్ 27న ముహూర్తం.. ఫ్యాక్టరీకి కొత్త పేరు పెట్టిన ఏపీ ప్రభుత్వం!
- ఉదయం 11 గంటలకు శంకుస్థాపన
- ఏర్పాట్లు పూర్తిచేస్తున్న అధికారులు
- ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం
కడప జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధమయింది. జిల్లాలోని మైలవరం మండలం కంబాలదిన్నెలో డిసెంబర్ 27న ఉదయం 11 గంటలకు ఈ గొప్ప ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం అధికారులు చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
‘రాయలసీమ ఉక్కు కర్మాగారం’ పేరుతో కడప స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఈ విషయమై సీఎం రమేశ్ మాట్లాడుతూ.. కేంద్రం సహకరించకపోవడం వల్లే ఏపీ ప్రభుత్వం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తెలుగు ప్రజలపై కక్ష కట్టినట్లు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కేంద్రంలో ఎల్లకాలం బీజేపీ అధికారంలో ఉండదనీ, చంద్రబాబు నిర్ణయించిన వ్యక్తే తర్వాతి భారత ప్రధానిగా ఎన్నికవుతారని జోస్యం చెప్పారు.