Chief Economic Advisor: పెద్ద నోట్ల రద్దు దారుణ నిర్ణయం.. మోదీకి షాకిచ్చిన అరవింద్ సుబ్రమణియన్

  • నోట్ల రద్దు అనూహ్య పరిణామం
  • జీడీపీ వృద్ధి పడిపోయింది
  • ప్రపంచంలో ఏ దేశమూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు

భారత మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోదీకి షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దు చాలా దారుణమైన నిర్ణయమని, దేశ ద్రవ్య విధానానికి ఇదో పెద్ద షాక్ అని త్వరలో విడుదల కాబోతున్న ‘ఆఫ్‌ కౌన్సిల్‌: ది ఛాలెంజెస్‌ ఆఫ్‌ ది మోదీ-జైట్లీ ఎకానమీ’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. నోట్ల రద్దు సమయంలో ఆర్థిక సలహాదారుగా ఉన్న అరవింద్‌‌ను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్షాలు అప్పట్లో ఆరోపించాయి. అయితే, ఈ విషయంపై అప్పట్లో మౌనంగా ఉన్న అరవింద్ సుబ్రమణియన్ తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

ప్రపంచలోని ఏ దేశమూ ఇటువంటి నిర్ణయం తీసుకోలేదని అరవింద్ పేర్కొన్నారు. ప్రధాని నిర్ణయంతో దేశ వృద్ధి రేటు గణనీయంగా తగ్గిందన్నారు. ఈ ఒక్క నిర్ణయంతో చలామణిలో ఉన్న నగదులో 86 శాతం వెనక్కి వెళ్లిందని, జీడీపీ వృద్ధిపై ఇది తీవ్ర ప్రభావం చూపించిందని అన్నారు. నోట్ల రద్దుకు ముందు ఆరు త్రైమాసికాల్లో సగటు జీడీపీ వృద్ధి 8 శాతంగా ఉంటే, నోట్ల రద్దు తర్వాత ఏడు త్రైమాసికాల్లో అది 6.8 శాతానికి పడిపోయిందన్నారు. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే నోట్ల రద్దు అనూహ్య పరిణామమని అరవింద్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు.  

  • Loading...

More Telugu News