rajatkumar: తెలంగాణ ఓటరు కోసం ‘నా ఓటు’ యాప్‌.. లోగో డిజైన్ చేసి పంపితే రూ.15వేలు బహుమతి: తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి

  • ‘నా ఓటు’ యాప్ ఆవిష్కరించిన రజత్ కుమార్
  • ఆండ్రాయిడ్, ఐఓస్ లపై పని చేస్తుంది 
  • లోగో డిజైన్ చేసి [email protected] మెయిల్‌కు పంపాలి  

తెలంగాణ ఓటరు కోసం ఇప్పుడు కొత్తగా ‘నా ఓటు’ అనే మరో అధునాతన, బహుళ ప్రయోజనకర యాప్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్, ఐఓస్ అనే రెండు ఆపరేటింగ్ సిస్టమ్ ల మీద పనిచేసే ఈ యాప్ ద్వారా ఓటరుకు కలిగే ప్రయోజనాలు-ఎపిక్ నంబరు, పేరు క్షణాల్లో వెతికి పట్టుకోవచ్చు.

ఎపిక్ నంబరు లేదా ఓటరు పేరుతో పోలింగ్ స్టేషన్ ఏదో, దానికి వెళ్ళడానికి దగ్గర దారి, అక్కడికి చేరుకోవడానికి వీలయిన బస్టాప్, రైల్వే స్టేషన్ ఎక్కడున్నాయో తెలుసుకోగలగడం, అన్నిటికీ మించి తన నియోజక వర్గం వివరాలు, అక్కడ ఎవరెవరు పోటీలో ఉన్నదీ తెలుసుకోవడం దీని ప్రత్యేకత.
 ఇక దివ్యాంగ ఓటర్లకయితే పోలింగ్ బూత్‌కు వెళ్ళిరావడానికి రవాణా సౌకర్యం కల్పించమని విన్నవించుకోవడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ యాప్‌ను తెలంగాణ రాష్ట్రంలోని ఓటర్లు ఉచితంగా వారి వారి స్మార్ట్ ఫోన్‌లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

కొత్తగా ఆవిష్కరించిన ‘నా ఓటు’ అనే అధునాతన యాప్‌కు ఆకర్షణీయంగా, అర్థవంతంగా లోగోను డిజైన్ చేసి పంపిన వారికి రూ.15వేలు బహుమతి ఇస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డా.రజత్ కుమార్ ప్రకటించారు. దీనిలో ఎవరయినా పాల్గొనవచ్చనీ, ఎంట్రీలను ఈరోజు నుండి డిసెంబరు 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా పంపాలని, ఉత్తమ ఎంట్రీని డిసెంబరు 10న ప్రకటిస్తామని ఆయన తెలియజేశారు. దరఖాస్తులను   [email protected] మెయిల్‌కు పంపాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News