AP departments: ఆంధ్రప్రదేశ్లో పరిపాలన శాఖలకు ర్యాంకులు...ప్రకటించిన సీఎం చంద్రబాబు
- జిల్లాల వారీగా ఏ, బీ విభాగాలు
- శాఖల వారీగా ఏ, బీ, సీ, డీ కేటగిరీలు
- అగ్రస్థానంలో నిలిచిన జల వనరుల శాఖ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనలో భాగంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పలు శాఖల పనితీరును అనుసరించి వాటికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ర్యాంకులు కేటాయించారు. జిల్లాల వారీగా రెండు విభాగాలుగాను, శాఖల వారీగా నాలుగు కేటగిరీలుగాను విభజించి ర్యాంకులు ప్రకటించారు. 150.2 శాతం ఫలితాలతో జల వనరుల శాఖ అగ్రస్థానంలో నిలిచింది.
జిల్లాల్లో 'ఏ' కేటగిరీలో ఉభయ గోదావరి జిల్లాలతోపాటు, కృష్ణ, చిత్తూరు, కడప జిల్లాలు నిలవగా, మిగిలిన జిల్లాలు 'బి' కేటగిరీలోకి వచ్చాయి. అలాగే, శాఖల వారీగా తీసుకుంటే 'ఏ' కేటగిరీలోకి జలవనరుల శాఖ, వ్యవసాయం, సహకారశాఖ, ఉద్యానం ...పట్టు పురుగుల శాఖ, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, పర్యావరణం, అటవీ శాఖ, వెనుకబడిన వర్గాల సంక్షేమం, కార్మిక, ఉపాధి కల్పన శాఖ, మహిళ, శిశు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల శాఖ, పశు సంవర్ధక, మత్స్య, ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమ శాఖలు నిలిచాయి.
ఇక 'బీ' కేటగిరీలోకి పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, విద్య, గృహ నిర్మాణం, ఇంధన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పంచాయతీరాజ్, గ్రామాణాభివృద్ధి, మైనారిటీల సంక్షేమ శాఖలు, 'సీ' కేటగిరీలోకి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు, 'డీ' కేటగిరీలోకి క్రీడలు, యువజన వ్యవహారాల శాఖలు వచ్చాయి.