rajani: తెలుగు రాష్ట్రాల్లో '2.ఓ' తొలిరోజు వసూళ్లు

  • ఎక్కడ చూసినా '2.ఓ' గురించిన చర్చలే 
  • తెలుగు రాష్ట్రాల్లో దూకుడు 
  • ఓవర్సీస్ లోను అదే జోరు

ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా '2.ఓ' గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా సాధిస్తోన్న వసూళ్లను గురించి .. కొత్తగా నమోదు చేస్తోన్న రికార్డులను గురించి చర్చించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. తొలి రోజున ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 4.43 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం.

ఇక సీడెడ్ .. నెల్లూరు .. గుంటూరు .. కృష్ణా .. పశ్చిమ గోదావరి .. తూర్పు గోదావరి .. ఉత్తరాంధ్రలోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. రెండు రాష్ట్రాల్లోను కలుపుకుని ఈ సినిమా 12.53 కోట్ల షేర్ ను వసూలు చేసింది. వీకెండ్ లో ఈ సినిమా జోరు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఓవర్సీస్ లోను ఈ సినిమా తన హవాను కొనసాగిస్తోందని చెప్పుకుంటున్నారు. శంకర్ టీమ్ ఇంతకాలం శ్రమించినందుకు తగిన ఫలితం దక్కిందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.  

  • Loading...

More Telugu News