balakrishna: ఎన్టీఆర్ బయోపిక్ నుంచి ఫస్టు సింగిల్ వచ్చేస్తోంది

  • షూటింగు దశలో ఎన్టీఆర్ బయోపిక్ 
  • సంగీత దర్శకుడిగా కీరవాణి 
  • జనవరి 9వ తేదీన భారీ విడుదల    

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ ముఖ్యమైన కొన్ని పాత్రలకి సంబంధించిన ఫస్టులుక్స్ వచ్చి అంచనాలు పెంచాయి. తాజాగా ఈ బయోపిక్ నుంచి ఫస్టు సింగిల్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు.

రేపు ఉదయం 7గంటల 42 నిమిషాలకి 'కథానాయకా' అనే సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ రోజు వదిలిన పోస్టర్ బట్టి చూస్తే ఇది టైటిల్ సాంగ్ అనిపిస్తోంది. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఫస్టు సాంగ్ తో అంచనాలు మరింతగా పెరిగే అవకాశాలు వున్నాయి. విద్యాబాలన్ .. రానా .. సుమంత్ .. రకుల్ .. నిత్యామీనన్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు.  

  • Loading...

More Telugu News