prjakutami: కూటమి ఏర్పాటుకు ముందే ఉప్పల్ సీటును దేవేందర్ గౌడ్ కొడుక్కి ఎలా కేటాయించారు?: టీజేఎస్ నాయకుడు మర్రి ఆదిత్యారెడ్డి
- టీజేఎస్ లో సీట్లు అమ్ముకోవడంపై విచారణ జరపలేదే?
- తెలంగాణకు కోదండరామ్ అన్యాయం చేస్తున్నారు
- 40 సీట్ల కోసం బీజేపీతో కోదండరామ్ బేరమాడారు
ప్రజా కూటమి ఏకపక్ష వైఖరి అనుసరిస్తోందని, కోదండరామ్ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ టీజేఎస్ ఉపాధ్యక్షురాలు రచనారెడ్డి ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజాకూటమికి చెందిన మర్రి ఆదిత్యారెడ్డి కూడా టీజేఎస్ పై మండిపడ్డారు. కూటమి ఏర్పాటుకు ముందే ఉప్పల్ సీటును టీడీపీ నేత దేవేందర్ గౌడ్ కుమారుడికి ఎలా కేటాయించారని ప్రశ్నించారు. టీజేఎస్ లో సీట్లు అమ్ముకోవడంపై ఎందుకు విచారణ జరపలేదని నిలదీశారు. వర్ధన్నపేట స్థానాన్ని అడగకపోయినా టీజేఎస్ కు ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు. తెలంగాణకు కోదండరామ్ తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించిన ఆదిత్యారెడ్డి, నలభై సీట్ల కోసం బీజేపీతో కోదండరామ్ బేరసారాలు చేశారని ఆరోపించారు.