Revanth Reddy: రేవంత్ అరెస్ట్‌తో డీజీపీపై అనుమానాలు.. సీనియర్ జర్నలిస్టు శ్రీనివాసరెడ్డి
- బెడ్రూంలోకి వెళ్లి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి?
- రేవంత్‌పై ఎందుకంత నిర్బంధం
- చంద్రబాబు ప్రచారాన్ని అడ్డుకోవాలన్న కేసీఆర్‌పై చర్యలేవీ?
కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అరెస్టును సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి తప్పుబట్టారు. కొద్దిసేపటి క్రితం ఓ చానల్‌తో మాట్లాడుతూ.. పోలీస్ యంత్రాంగం నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందన్నారు. రేవంత్‌పై ఎందుకింత నిర్బంధమో అర్థం కావడం లేదన్నారు. ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేందుకు పోలీసు యంత్రాంగం నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందన్నారు. రేవంత్ అరెస్టును ఈసీ, పోలీసులు ఏ రకంగా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. స్వయంగా డీజీపీనే క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు.
తెలంగాణలో ఏపీ ముఖ్యమంత్రి నిర్వహించే సభలను అడ్డుకోవాలని స్వయంగా కేసీఆర్ పిలుపు ఇచ్చినప్పుడు ఈసీ ఎక్కడికి వెళ్లిందని, ఏం చేసిందని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేస్తే తప్పేంటని నిలదీశారు. రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకున్నప్పుడు, కేసీఆర్‌పై ఎందుకు తీసుకోరని ఈసీని సూటిగా ప్రశ్నించారు. ఓ వ్యక్తిని బెడ్రూంలోకి వెళ్లి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని శ్రీనివాసరెడ్డి పోలీసులను ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే అధికార పార్టీకి డీజీపీ బానిస అయ్యారన్న అనుమానాలు కలుగుతున్నాయని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.