Twitter: నిర్భయంగా ఈ ఒక్క విషయం చెప్పగలవా చంద్రబాబూ?: విజయసాయిరెడ్డి

  • భయపెడితే బెదరనని బీరాలు
  • ఎవరికి భయపడి హైదరాబాద్ ను వదిలి పారిపోయావు?
  • ఏ భయంతో సీబీఐని నిషేధించావు?
  • ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి ప్రశ్నలు

తనను తిట్టినా, ఛీ కొట్టినా భరిస్తానంటూ చంద్రబాబు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "తిట్టినా... ఛీ కొట్టినా భరిస్తాడట షేమ్ లెస్ నాయుడు బాబు! కానీ భయపెడితే మాత్రం బెదరనని పైకి బీరాలు. ఎవరికి భయపడి రాత్రికి రాత్రి ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ ను వదలి మూటా ముల్లె సర్దుకుని పారిపోయాడో? ఏ భయంతో సీబీఐని రాష్ట్రం నుంచి నిషేధించాడో ప్రజలకు నిర్భయంగా చెప్పగలడా ఈ అబద్దాలనాయుడు?" అంటూ ప్రశ్నించారు.



  • Loading...

More Telugu News