Revanth Reddy: రేవంత్ రెడ్డి అరెస్టుపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్.. విచారణకు అంగీకరించిన న్యాయస్థానం!

  • ఈరోజు మధ్యాహ్నం పిటిషన్ పై విచారణ
  • తెల్లవారుజామున రేవంత్ ను తీసుకెళ్లిన పోలీసులు
  • కోస్గీ సభను అడ్డుకుంటామని గతంలో ప్రకటించిన రేవంత్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కొడంగల్ లోని కోస్గీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభను అడ్డుకుంటామని ప్రకటించడంతో రేవంత్ ను తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. తొలుత రేవంత్ ను జడ్చర్ల పోలీస్ శిక్షణా కేంద్రానికి తరలిస్తారని చెప్పినప్పటికీ, ప్రస్తుతం రేవంత్ ఎక్కడున్నారన్న అంశం మిస్టరీగా మారింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. రేవంత్ ను వెంటనే విడుదల చేయాలనీ, ఆయన ఎక్కడున్నారో చెప్పాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. తమ నేతను అర్ధరాత్రి ఎలాంటి కారణం చెప్పకుండా పోలీసులు అరెస్ట్ చేశారని ఆరోపించింది. కాగా, కాంగ్రెస్ పార్టీ దాఖలుచేసిన ఈ పిటిషన్ ను ఉమ్మడి హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ రోజు మధ్యాహ్నం హైకోర్టు కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిిటిషన్ పై వాదనలు విననుంది.

  • Loading...

More Telugu News