K Kavitha: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్ర పాలన వస్తుంది: టీఆర్ఎస్ ఎంపీ కవిత
- ఊపందుకున్న ప్రచార జోరు
- సంక్షేమం కొనసాగాలంటే టీఆర్ఎస్ రావాలి
- అధికారంలోకి రాగానే డబుల్ బెడ్రూం ఇళ్లు
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణలో ప్రచార జోరు ఊపందుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ తెలంగాణలో ఆంధ్ర పాలన వస్తుందని ఎంపీ కవిత పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డికి మద్దతుగా కవిత రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో సంక్షేమం ఆగిపోకుండా ఉండాలంటే టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామన్నారు.