Chandrababu: నాలుగేళ్లు వేచి చూశాం.. కక్షకు కూడా ఓ హద్దు ఉంటుంది కదా: చంద్రబాబు

  • యోగి వేమన యూనివర్సిటీలో ‘జ్ఞానభేరి’
  • దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉసిగొల్పుతోంది
  • కాంగ్రెస్‌తో కలిసింది కూడా అందుకే

ఎంత కక్షగట్టినా దానికీ ఓ హద్దు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. నాలుగేళ్లు నిరీక్షించినా ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదని అన్నారు. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో మంగళవారం నిర్వహించిన ‘జ్ఞానభేరి’ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ఏపీపై కేంద్రం కక్ష సాధిస్తోందన్న సీఎం.. దానికీ ఓ హద్దు ఉంటుందన్నారు. సీబీఐ, ఈడీ సహా అన్ని సంస్థలను ఏపీపై ఉసిగొల్పి కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నారు.

పోలవరం  ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వడ్డీతో సహా రాబడతామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్నారు. విభజన తర్వాత ఎన్నో కష్టాలు అనుభవించామన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, నిర్మాణ వ్యయాన్ని తామే భరిస్తామన్న కేంద్రం నాలుగేళ్లు దాటినా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. కేంద్రం తీరుకు నిరసనగానే అన్ని పార్టీలను ఏకం చేసి పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇందులో భాగంగానే 37 ఏళ్లు పోరాడిన కాంగ్రెస్‌తో కూడా జట్టు కట్టాల్సి వచ్చిందని చంద్రబాబు వివరించారు.

  • Loading...

More Telugu News