Revanth Reddy: రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారం.. హైకోర్టులో విచారణకు హాజరైన డీజీపీ మహేందర్ రెడ్డి
- అరెస్ట్ చేయాలని ఏ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు?
- నివేదికలపై సంతకాలు, తేదీలు.. ఎందుకు లేవు?
- ఎవరినైనా, ఎప్పుడైనా అరెస్టు చేస్తారా?
- డీజీపీని ప్రశ్నించిన హైకోర్టు
టీ- కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో విచారణ నిమిత్తం హాజరుకావాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టులో విచారణకు ఆయన హాజరయ్యారు. రేవంత్ రెడ్డి అరెస్టు విషయంలో పోలీసుల తీరుపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
పోలీసులు సమర్పించిన నిఘా వర్గాల నివేదికలపై అనుమానం వ్యక్తం చేసింది. సంబంధిత నివేదికలపై సంతకాలు, తేదీలు, అధికారిక ముద్రలు, ఎందుకు లేవని, ఎవరినైనా, ఎప్పుడైనా అరెస్టు చేస్తారా? అని హైకోర్టు ప్రశ్నించింది. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఏ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారని డీజీపీని ప్రశ్నించింది. ఈ కేసు విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.