Hyderabad: పోలింగ్ బూత్‌లోకి సెల్ఫోన్లను అనుమతించబోం.. క్లారిటీ ఇచ్చిన హైదరాబాద్ సీపీ
- ఓటర్లు ఏదో ఒక గుర్తింపు కార్డును తీసుకురావాలి
- నగరంలో 3,911 పోలింగ్ స్టేషన్లు
- 518 చెక్‌పోస్టుల ఏర్పాటు
పోలింగ్ బూత్‌లోకి సెల్ఫోన్లు అనుమతిస్తారా? లేదా? అన్న దానిపై హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ స్పష్టత ఇచ్చారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన పోలింగ్ బూత్‌లోకి సెల్ఫోన్లను అనుమతిస్తారా? లేదా? అన్న దానిపై తొలిసారి ఓటు వేయనున్న వారికి సందేహాలు ఉన్నాయని పేర్కొన్న ఆయన.. మొబైల్స్‌ను అనుమతించబోమని స్పష్టం చేశారు.
ఓటు వేయడానికి వచ్చే వారు ఆధార్, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులలో ఏదో ఒక దానిని తీసుకురావాలని సూచించారు. హైదరాబాద్‌లో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. నగరంలో మొత్తం 3,911 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. నగరంలో మొత్తం 518 చెక్‌పోస్టులు, 60 షాడో టీంలు ఏర్పాటు చేశామని, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 15 నియోజకవర్గాలకు నోడల్ అధికారులను నియమించినట్టు అంజన్ కుమార్ వివరించారు.