depresure: బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు.. నేడు మొదటిది బలపడే అవకాశం
- 9వ తేదీ నాటికి మరొకటి ఏర్పడుతుందని వెల్లడించిన వాతావరణ కేంద్రం
- కోస్తాంధ్ర, రాయల సీమలకు వర్ష సూచన
- మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక
బంగాళాఖాతంలో ఒకదాని వెంట మరొకటిగా రెండు అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో రెండూ బలపడి బంగాళాఖాతాన్ని ఆనుకుని దక్షిణ కోస్తా తీరంపై ప్రభావం చూపనున్నాయని విశాఖ వాతావరణ హెచ్చరిక కేంద్రం తెలియజేసింది.
భూమధ్య రేఖ పరిసర ప్రాంతాల్లో ఏర్పడుతున్న ఈ అల్పపీడనాల్లో ఒకటి గురువారం నాటికే బలపడే అవకాశం ఉందని, మరొకటి ఈనెల 9వ తేదీ నాటికి ప్రభావం చూపిస్తుందని తెలిపింది. తీర ప్రాంతంలో బలమైన గాలులు వీస్తాయని, గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయల సీమల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండడం, గాలుల ప్రభావం తీవ్రంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.