Chandrababu: ఏపీకి ఆర్థిక సాయం.. కేంద్రం నిర్ణయం!
- ఉన్నత స్థాయి కమిటీతో రాజ్నాథ్ భేటి
- వరద ప్రభావిత రాష్ట్రాలపై చర్చ
- ఏపీకి రూ.539.52 కోట్లు మంజూరు
తితిలీ తుపాను ప్రభావానికి శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. అక్కడి ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ సందర్భంగా జరిగిన నష్టాన్ని రూ.3,435 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. దీనిపై నేడో రేపో ఏపీకి శుభవార్త అందనుంది.
చంద్రబాబు లేఖపై స్పందించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ .. నేటి సాయంత్రం ఉన్నత స్థాయి కమిటీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో.. ఇటీవల వరద ప్రభావానికి గురైన, కేరళ, నాగాలాండ్, ఏపీ రాష్టాలకు ఆర్థిక సాయంపై చర్చ జరిగింది. దీనిలో భాగంగా తితిలీ తుపాను నష్టపరిహారంగా ఏపీకి రూ. 539.52 కోట్లు మంజూరు చేసేందుకు కమిటీ నిర్ణయించింది. నేటి రాత్రి కానీ.. రేపు గానీ ఈ పరిహారాన్ని కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది.