Jithender: నిన్నటి వరకూ రూ.93 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నాం: అదనపు డీజీ

  • రాష్ట్ర వ్యాప్తంగా 404 చెక్‌పోస్ట్‌లు
  • 414 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు
  • 4 లక్షల లీటర్లకు పైగా మద్యం సీజ్‌
  • పట్టుబడిన డబ్బుపై విచారణ
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో నిన్నటి వరకూ వివిధ పార్టీలకు చెందిన రూ.93 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని అదనపు డీజీ జితేందర్ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనిఖీల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 404 చెక్‌పోస్ట్‌లు, 414 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో 4 లక్షల లీటర్లకు పైగా మద్యాన్ని సీజ్‌ చేసినట్లు అదనపు డీజీ తెలిపారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన వారిపై 1,353 కేసులు నమోదు చేశామన్నారు. పోలింగ్‌కు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేశామని.. ఎన్నికల ప్రక్రియలో భాగంగా కొందరు పోలీసు అధికారులపై ఫిర్యాదులు అందాయని.. వాటిని పరిశీలిస్తున్నామని జితేందర్‌ తెలిపారు. ఇప్పటి వరకూ పట్టుబడిన హవాలా డబ్బుపై విచారణ కొనసాగుతోందన్నారు.
Jithender
Telangana
Check Posts
Poling

More Telugu News