selfi in poling station: ఓటు వేస్తూ సెల్ఫీ దిగిన యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు

  • అత్యుత్సాహం ప్రదర్శించి కటకటాలు లెక్కిస్తున్న వైనం
  • రాజేంద్రనగర్‌లో ఘటన
  • నిందితుడు ఉప్పర్‌పల్లికి చెందిన శివశంకర్‌గా గుర్తింపు
ఉత్సాహం మంచిదే...అత్యుత్సాహం ఎప్పుడూ చేటు తెస్తుంది. పైగా ఎన్నికల కమిషన్‌ నిబంధనలను తు.చ తప్పకుండా పాటించకుంటే చిక్కులు తప్పవు. హైదరాబాద్‌ మహానగరం రాజేంద్రనగర్‌లో జరిగిన ఈ ఘటన  ఇందుకు ఉదాహరణ.

ఓటు వేసేటప్పుడు గోప్యత పాటించాలని, ఫొటో తీసినా, సెల్ఫీ దిగినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినా ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. రాజేంద్రనగర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేస్తూ సెల్ఫీ దిగాడు. పోలీసులు దీన్ని గమనించి కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
selfi in poling station
youth arested
Hyderabad
rajendranagar

More Telugu News