druken test: ఓటు వేయడానికి వెళ్లినా తప్పని బాధలు.. మందుబాబులకు పోలీసుల షాక్!
- నల్గొండలో మందుబాబులకు డ్రంకెన్ టెస్టులు నిర్వహించిన పోలీసులు
- ఓ ఓటరుకు టెస్టు నిర్వహించిన ఫొటో వైరల్
- రాష్ట్రంలో ఊపందుకున్న పోలింగ్
తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 75 నుంచి 80 శాతం వరకు పోలింగ్ నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సెల్ ఫోన్లతో పోలింగ్ స్టేషన్ కు వచ్చిన ఓటర్లను కొన్ని చోట్ల పోలీసులు లోపలకు అనుమతించలేదు. నల్గొండ లోని ఓ పోలింగ్ కేంద్రంలో మాత్రం మందుబాబులకు పోలీసులు చుక్కలు చూపించారు. మందు వాసన వచ్చిన వారికి డ్రంకెన్ టెస్టులు నిర్వహించారు. ఓ ఓటరుకు పోలీసు అధికారి డ్రంకెన్ టెస్టును నిర్వహిచిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.