Telangana: తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

  • మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాలు
  • ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
  • నాలుగు గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం
తెలంగాణలోని మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నాలుగు గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. నాలుగు గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 5 నియోజకవర్గాలు  సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్ లో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాలు  భద్రాచలం, అశ్వారావుపేట, కొత్తగూడెం, పినపాక, ఇల్లెందులో, వరంగల్ జిల్లాలోని 2 నియోజకవర్గాలు భూపాలపల్లి, ములుగులో, కరీంనగర్ జిల్లాలోని మంథని నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. కాగా, తెలంగాణలోని మిగిలిన నియోజకవర్గాల్లో ఐదు గంటలకు పోలింగ్ ముగియనుంది.
Telangana
13 constituencies
poling
elections

More Telugu News