sensex: మూడు రోజుల నష్టాలకు బ్రేక్.. భారీగా పుంజుకున్న మార్కెట్లు
- తగ్గిన క్రూడాయిల్ ధరలు, పెరిగిన రూపాయి విలువ
- హ్యాథ్ వే పెట్టుబడుల వార్తలతో.. కొటక్ బ్యాంక్ అప్
- 361 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
మూడు రోజుల వరుస నష్టాలకు దేశీయ మార్కెట్లు ఈరోజు ముగింపు పలికాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గడం, రూపాయి విలువ కొంచెం పుంజుకోవడంతో మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. హ్యాథ్ వే భారీగా పెట్టుబడులు పెట్టబోతోందనే వార్తలతో కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ఎగబాకాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 361 పాయింట్లు లాభపడి 35,673కు పెరిగింది. నిఫ్టీ 93 పాయింట్లు పుంజుకుని 10,694కు చేరుకుంది.
టాప్ గెయినర్స్:
ముత్తూట్ ఫైనాన్స్ (13.22%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (8.53%), వక్రాంగీ (4.99%), మణప్పురం ఫైనాన్స్ (4.59%), ఎం అండ్ ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ (4.29%).
టాప్ లూజర్స్:
నవకార్ కార్పొరేషన్ (-10.91%), మన్ పసంద్ బెవరేజెస్ (-5.47%), ఐనాక్స్ విండ్ (-5.13%), మాగ్మా ఫిన్ కార్ప్ (-4.99%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-4.98%).