sumalata: అంబరీశ్ .. నీ జ్ఞాపకాలతో బతికే బలాన్ని నువ్వే ఇవ్వాలి: కన్నీళ్లతో సుమలత
- ఈ రోజు మనకి ఎంతోముఖ్యమైన రోజు
- నువ్వే నా ప్రపంచం అనిపించావు
- నా చేయిపట్టుకుని నడిపించావు
సుమలత .. అంబరీశ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు .. వారిది ఎంతో అన్యోన్యమైన దాంపత్యం. ఇటీవలే అంబరీశ్ చనిపోవడంతో ఆ శోక సంద్రం నుంచి సుమలత ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఈ రోజున వాళ్ల పెళ్లిరోజు .. షోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని సుమలత గుర్తు చేసుకున్నారు.
"ప్రియమైన అంబరీశ్ .. మనకి ఎంతో ముఖ్యమైన ఈ రోజున తొలిసారి నువ్వు నా పక్కనలేవు. నీతోనే నా జీవితంలోకి వెలుగు వచ్చింది .. ఆ వెలుగులోనే నా జీవితం ప్రారంభమైంది. ఎండలో .. వానలో గొడుగులా నిలిచి, ప్రేమతో నా చేయిపట్టుకుని ముందుకు నడిపించావు. నువ్వే నా ప్రపంచం అనిపించావు. ఇంతకుముందే కాదు .. ఇకముందు కూడా మా భద్రత నువ్వే చూసుకుంటావని నాకు తెలుసు. బద్దలైన హృదయంతో .. మౌనంగా బతకవలసిన పరిస్థితి. నీ జ్ఞాపకాలతో బతికే బలాన్ని .. ప్రేమను నువ్వే ఇవ్వాలి" అంటూ ఆమె వరుస ట్వీట్లు చేస్తూ .. ఫోటోలు షేర్ చేశారు.