gajwel: ఏదో గ్యాంబ్లింగ్ జరగబోతోంది.. వీవీ ప్యాట్స్ లోని ప్రింటెడ్ స్లిప్పుల కౌంట్ కు ఈసీ అనుమతివ్వాలి: వంటేరు డిమాండ్
- ఈ డిమాండ్ ను ఎన్నికల సంఘం అంగీకరించాలి
- లేనిపక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తా
- సోమవారం ఉదయం ఎమర్జెన్సీ పిటిషన్ వేస్తా
గజ్వేల్ లో కేసీఆర్ పై నలభై నుంచి యాభై వేల మెజార్టీతో తాను గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి, ఇక్కడ ఏదో గ్యాంబ్లింగ్ జరగబోతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్స్ లో వచ్చే ప్రింటెడ్ స్లిప్పులనూ కౌంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ ను ఎన్నికల సంఘం అంగీకరించాలని కోరారు.
ఈవీఎంలపై ప్రజలకు అనుమానం ఉండటంతో, అటువంటిదేమీ లేదని చెప్పేందుకే వీవీ ప్యాట్స్ ను పెట్టారని, ఈ విషయమై తమకు కూడా అనుమానం ఉంది కనుక, తాను ఈ డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. ఒకవేళ ఎన్నికల కమిషన్ కు అనుమతివ్వకపోతే హైకోర్టుకు వెళతామని చెప్పారు. సోమవారం ఉదయం ఎమర్జెన్సీ పిటిషన్ వేసి అనుమతి పొందుతామని అన్నారు