Telangana: ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి.. 44 కేంద్రాలు సిద్ధం

  • మంగళవారం తేలిపోనున్న అభ్యర్థుల భవితవ్యం
  •  ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
  • సిబ్బందికి నేడు శిక్షణ

తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు. 11న 31 జిల్లా కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకోసం 44 కేంద్రాలను సిద్ధం చేశారు. లెక్కింపునకు అనువుగా ఉండేలా బెంచీలు, ఈవీఎంలను ఓ క్రమ పద్ధతిలో అమర్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 44 కేంద్రాల్లో ఒక్క హైదరాబాద్‌లోనే అత్యధికంగా 13 ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి బెంచీలు ఏర్పాటు చేయనున్నారు. లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి నేడు శిక్షణ ఇవ్వనున్నారు.  

ఈసారి ఎన్నికల్లో వీవీపాట్ యంత్రాలను కూడా ఉపయోగించడంతో ఆ స్లిప్పులను కూడా లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ప్రతి నియోజకవర్గంలోనూ ఓ పోలింగ్ కేంద్రాన్ని ఎంచుకుని అక్కడి వీవీపాట్ స్లిప్పుల సంఖ్యను లెక్కిస్తారు. ఈవీఎంలో పోలైన ఓట్ల సంఖ్య, వీవీపాట్ స్లిప్పుల సంఖ్య సరిపోలితే పోలింగ్ సక్రమంగా జరిగినట్టు నిర్ధారిస్తారు. జిల్లా కేంద్రాల్లో జరిగే లెక్కింపు ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు సీసీ టీవీ ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నారు.

  • Loading...

More Telugu News