Australia: ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌లో పట్టు బిగిస్తున్న భారత్‌ : లంచ్‌ విరామానికి 260/5

  • నాలుగోరోజు 151 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభం
  • మరో రెండు వికెట్లు కోల్పోయి 109 పరుగులు జత చేసిన టీమిండియా
  • ఇంకా చేతిలో సగం వికెట్లు

ఆస్ట్రేలియాలో ఆ దేశంతో జరుగుతున్న తొలిటెస్ట్‌లో భారత్‌ పట్టు బిగిస్తోంది. అడిలైడ్‌ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగో రోజు లంచ్‌ విరామ సమయానికి భారత్‌ ఐదు వికెట్లు కోల్పోయి 260 పరుగులు సాధించింది. అజింక్య రహానే  57 పరుగులు, రిషబ్‌పంత్‌ పది పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రహానే తన ఓవర్‌ నైట్‌ స్కోరు 34 పరుగులకు మరో 16 పరుగులు జోడించి ఆఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఇప్పటి వరకు భారత్‌ 275 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

రెండు జట్లు మొదటి ఇన్నింగ్స్‌లో ఎదుర్కొన్న పరిస్థితి, పిచ్‌ స్వభావాన్ని అనుసరించి భారత్‌ ప్రత్యర్ధి ముందు రెండు వందల పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగితే చాలని, గెలుపు ముంగిట నిలుస్తుందని క్రికెట్‌ వర్గాల అంచనా. భారత్‌ నిలకడగా రాణిస్తూ 300 పరుగుల వైపు దూసుకువెళ్తూ టెస్ట్‌పై పట్టు సాధిస్తుండడంతో విజయావకాశాలు ఉన్నట్టే. ఇంకా ఐదు వికెట్లు చేతిలో ఉండడంతో మూడు వందలు దాటడం పెద్ద కష్టం కాకపోవచ్చు.

ఈ టెస్ట్‌లో తొలి నుంచి కంగారూలపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్న భారత్‌ ఇదే జోరు కొనసాగించి బౌలర్లు కూడా సత్తా చాటితే చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై సీరిస్‌ మొదటి టెస్ట్‌లో విజయం సాధించినట్టవుతుంది.

  • Loading...

More Telugu News