shakeela: ఒకప్పుడు నాకూ లైంగిక వేధింపులు ఎదురయ్యాయి: శృంగార తార షకీలా
- వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పాను
- వాళ్లు నాకు ఎదురుపడితే చేతులు కట్టుకుంటారు
- లైంగిక వేధింపులు ఎదురైతే వెంటనే బయటపెట్టాలి
ఒకప్పుడు తాను లైంగిక వేధింపుల బారిన పడిన దానినేనని, అయితే, వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పానని ప్రముఖ శృంగార తార షకీలా చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తాను ఎవరికైతే బుద్ధి చెప్పానో, వాళ్లు తనకు ఎదురుపడితే చేతులు కట్టుకుంటారని పేర్కొంది.
చిత్ర పరిశ్రమలోకి కొత్తగా వచ్చే చాలా మంది అమ్మాయిలు ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారని చెప్పింది. అయితే, ఏ అమ్మాయికైనా లైంగిక వేధింపులు, బెదిరింపులు ఎదురైతే వెంటనే బయటపెట్టాలి తప్ప, చాలా ఏళ్లు గడిచిన తర్వాత ఆ సంఘటనలను బయటపెట్టడం అంత తెలివైన పనికాదంటూ ‘మీటూ’ ఉద్యమంపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది.