Kashmir boy: ఏడేళ్ల కశ్మీర్ కుర్రాడి గూగ్లీకి దిగ్గజ బౌలర్ వార్న్ ఫిదా.. బాల్ ఆఫ్ ద సెంచరీగా కితాబు

  • గూగ్లీ సంధించి వికెట్‌ను పడగొట్టిన బాలుడు
  • వార్న్‌కు చూపించిన ఫాక్స్ క్రికెట్
  • అద్భుతమంటూ రీ ట్వీట్ చేసిన స్పిన్ లెజెండ్

జమ్ముకశ్మీర్‌లోని గండెర్‌బల్ జిల్లాకు చెందిన ఏడేళ్ల బాలుడు అహ్మద్ అబ్బాస్‌పై ఆసీస్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ ప్రశంసలు కురిపించాడు. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న అహ్మద్ వేసిన గూగ్లీకి ఫిదా అయ్యాడు. ఈ వీడియోను రీ ట్వీట్ చేస్తూ.. ‘అద్భుతం.. బ్రహ్మాండంగా బౌలింగ్ చేశావ్’’ అంటూ పేర్కొన్నాడు. అంతేకాదు, బాలుడు సంధించిన గూగ్లీని ‘బాల్ ఆఫ్ ద సెంచరీ’గా అభివర్ణించాడు.  

ఈ ఏడాది మొదట్లో జరిగిందీ ఘటన. యువకులతో కలిసి క్రికెట్ ఆడుతున్న అబ్బాస్ అచ్చం ప్రొఫెషనల్ బౌలర్‌లా సంధించిన గూగ్లీ వికెట్లను గిరాటేసింది. క్రీజులో ఉన్న యువకుడు ఆ షాక్ నుంచి తేరుకునేందుకు కాసేపు పట్టింది. వికెట్ పడగొట్టిన బాలుడు ఆనందంతో సంబరాలు చేసుకున్నాడు.

అప్పటి నుంచి వైరల్ అవుతున్నఈ వీడియో తాజాగా వార్న్ దృష్టిలో పడింది. బాలుడి గూగ్లీని చూసి అతడు కూడా ఫిదా అయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టును ప్రసారం చేస్తున్న ‘ఫాక్స్ క్రికెట్’ ఈ వీడియోను ప్రదర్శించింది. ఇది చూసిన వార్న్ ఆశ్చర్యపోయాడు. బాలుడు సంధించిన గూగ్లీని ‘బాల్ ఆఫ్ ద సెంచరీ’గా అభివర్ణించాడు.

  • Loading...

More Telugu News