Odisha: ప్రత్యేక హోదాపై గళం విప్పుతున్న ఒడిశా...పార్లమెంటులో ఆందోళనకు బిజూ ఎంపీల నిర్ణయం

  • శీతాకాల సమావేశాల్లో డిమాండ్ వినిపించాలని సీఎం దిశానిర్దేశం
  • ఉపకార వేతనాల నిధుల కోసం పోరాటం
  • తిత్లీ తుపాన్‌ నష్టాన్ని భర్తీ చేయాలని కోరనున్న సభ్యులు

నిన్నమొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన ప్రత్యేక హోదా నినాదం మన పొరుగు రాష్ట్రమైన ఒడిశాలోనూ ప్రతిధ్వనించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో డిమాండ్‌ చేయాలని ఒడిశాలోని అధికార బిజూ జనతాదళ్‌ ఎంపీలు నిర్ణయించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ అధ్యక్షతన సమావేశమైన ఎంపీలు ఈ అంశంపై కూలంకుషంగా చర్చించారు.

మంగళవారం నుంచి జరగనున్న శీతాకాల సమావేశాల్లో హోదా నినాదాన్ని పార్లమెంటులో గట్టిగా వినిపించాలని సీఎం తమ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. హోదాతోపాటు రాష్ట్రంలోని బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం నిధులు ఇవ్వాలని, తిత్లీ తుపాన్‌ పీడిత ప్రాంతాల్లో రైతులను ఆదుకునేందుకు సహాయం చేయాలని బీజేడీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News