Prakash Raj: ఆర్బీఐ గవర్నర్ రాజీనామా నేపథ్యంలో.. కేంద్రంపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం
- సీబీఐ చీఫ్‌ను సెలవులపై పంపించారు
- సుప్రీంకోర్టు జడ్జీలు ధ్వజమెత్తారు
- మౌన ప్రేక్షకుల్లా ఇంకెన్నాళ్లు భరిస్తాం
‘జస్ట్ ఆస్కింగ్’ పేరుతో ఎన్డీఏ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్న ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్.. మరోసారి విరుచుకుపడ్డారు. ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ రాజీనామా నేపథ్యంలో ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ ప్రభుత్వాన్ని మౌన ప్రేక్షకుల్లా ఇంకెన్నాళ్లు భరిస్తామంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఆర్బీఐ చీఫ్ రాజీనామా చేశారు.. సీబీఐ చీఫ్‌ను సెలవులపై పంపించారు. నలుగురు సుప్రీంకోర్టు జడ్జీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధ్వజమెత్తారు. ఈ విధ్వంసకర ప్రభుత్వాన్ని దేశ పౌరులం మౌన ప్రేక్షకుల్లా ఇంకెన్నాళ్లు భరిస్తాం?’’ అని ట్వీట్లో ఆయన పేర్కొన్నారు.